హోమ్దేవుడు-దైవత్వంమనిషి-మనస్తత్వంస్వర్గం-నరకంపాపం-పుణ్యందేవదూతలు-దేవతలువిగ్రహాలుమేధావులుఅమతము-కులము

25, ఆగస్టు 2012, శనివారం

దేవుడు దైవత్వము - మానవుడు మానవత్వము

దేవుడు జీవముగల వాడు : 
ఆయన జీవములేని వాడు  కాదు.
అంతేకాదు కాని ,ఆయన జీవములేని వాటికి జీవమును ఇవ్వగల సమర్ధుడు. 
దేవుడు మాట్లాడే వాడు.
అందుకనే ఆయన మాట్లాడగలిగిన మనిషిని సృష్టించగలిగాడు.ఆయన మూగవాడైనట్లయితే  మనుష్యులమైన మనము కూడా మూగవారిగా ఉండే వారము .దేవుడు ఎంత గొప్పవాడో చూడండి తనలోని మాట్లాడే శక్తిని మనలో  ఉంచాడు .  
దేవుడు  ప్రేమస్వరూపిఐయున్నాడు  :
అవును దేవుడు ప్రేమకలిగినవాడు అందుకనే మనిషిని సృష్టించటానికి ముందు దేవుడు మనిషి మనుగడకు కావలసిన  వాటినన్నిటిని ఆయన సృష్టించి ఆ తర్వాత మనిషిని సృష్టించినాడు .
మనిషిని సృష్టించటానికి దేవుడు నేలమట్టిని తీసుకుని ఒక (బొమ్మను) నరుని  చేసి వాని నాసికారంద్రములలో , ఆయనలోఉన్న జీవ వాయువును అనగా ఆక్సిజన్ను ఊదాడు అందుకే మనిషి ముక్కుతోనే గాలి పీలుస్తున్నాడు.మనము జీవించుటకు, దేవుడు ముందుగానే మనకోసము 
శూన్యములో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ను పీల్చుతూ ,కార్బండైయాక్సైడ్ను వదుల్తున్నాము .
ఇక్కడ దేవుని ప్రేమను చూడండి మనము వదిలే కార్బండైయాక్సైడ్ వలన మనము పీల్చే గాలి కలుషితమవుతుందని, మనము వదిలిన గాలిని పీల్చటానికి  దేవుడు మనకంటే ముందు చెట్లను సృష్టించాడు.ఇప్పుడేమో మనిషి భూమిని కార్బండయాక్సైడ్తోతో నింపేశాడు .  
సూర్యుడి నుండి వచ్చే వేడిని ,చంద్రుని నుండి వచ్చే వెన్నెలను, ఆకాశమునుండి వర్షమును ,మంచును, భూమినుండి  వచ్చే భూఫలమును అనుభవించుటకు ,మనకంటే  ముందుగానే దేవుడు వీటిని మనకోసం సృష్టిచేసి ఉంచాడు .మనము అన్ని విషయములలో దేవుని గురించి తెలుసుకోవాలి .దేనిని మనము కొట్టివేయకూడదు జాగ్రత సుమా.... . 
మరి ,ఆ దేవాది దేవుని ఘనతను తెలుసుకుని ఆయన ఘనతను చాటుదామా? 
ఇంకా ఆయనను గూర్చిన గొప్ప సంగతులను రాబోవు పోష్టులలో చూద్దాము.               

కామెంట్‌లు లేవు: