హోమ్దేవుడు-దైవత్వంమనిషి-మనస్తత్వంస్వర్గం-నరకంపాపం-పుణ్యందేవదూతలు-దేవతలువిగ్రహాలుమేధావులుఅమతము-కులము

30, ఆగస్టు 2012, గురువారం

daiva anveshana

దైవాన్వేషణ ఆదినుండి మానవునికున్న ఓ తపన.నూటికి ఒకరో,ఇద్దరో మినహా, మానవులు దేవుడంటే చాలా భక్తిని కలిగి ఉంటారు. ముఖ్యంగా భారతదేశములో దైవ చింతన చాల ఎక్కువ.ఈ చాలా ఎక్కువైనా దైవ చింతన కొన్నిసార్లు,అనేకమైన అనర్ధాలకు దారితీస్తుంది.ఈ క్రమములో మనుష్యుల ప్రాణములను తీయుటకైనను వెనుకాడే పరిస్థితులు కనబడవు .ఆ దేవుని భక్తులు మా ప్రాంతంలో ఎక్కువవుతున్నారని కొందరు,మా దేవుని కాదని వేరొక దేవుడిని ప్రకటించి మతాన్ని మారుస్తున్నారని కొందరు మనష్యుల ప్రాణములను తీయటము మనము తరచుగా వార్తలలో చూస్తున్నాము.ఇదంతా కూడా దేవుని మీద భక్తితో చేసేదే, కాని ఇవి  చాలా బాధాకరమైన పరిస్థితులు.  ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టే దేవుడు ఆయన దైవత్వము గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలనే నా తపన. అంటే దేవుని గునలక్షణములను తెలుసుకోవటము వలన, ప్రతి భక్తుడు భక్తిని మాత్రమే గాక భయమును కూడా కలిగి జీవించగలుగుతాడు.
ఉదా : భక్తులు,వారి వారి  భక్తిని చూపించు విధములు చాలా రకములుగా ఉంటుంది 

అందులో రెండు :.
 ( 1 ) ఒక భక్తుడు అనుకుంటాడు నా చేతుల కష్టార్జితముతో దేవునికి ఏదైనా చేయాలి లేదా ఏదైనా ఇవ్వాలి అనుకుంటాడు, ఈ భక్తుడు అలానే కష్టపడతాడు.   
( 2 ) రెండో భక్తుడు, ఏమిచేసినా సరే దేవునికి ఏదైనా చేయాలి లేదా ఏదైనా ఇవ్వాలి  అనుకుంటాడు.ఈ భక్తుడు ఉదయము లేచిన దగ్గరనుండి రాత్రి నిద్ర పోయేంతవరకు ఎవరిని మోసం చేయాలి,ఎటువంటి అబద్దములు ఆడాలి, ఏ ఇల్లు దొంగతనము చెయ్యాలి,అనేటువంటి దేవుని వ్యతిరకమైన పనులు చేయటానికి సమయము కోసము ఎదురుచూస్తుంటాడు.ఆ దుర్మార్గపు పని చేయగానే వచ్చిన సొమ్ములో దేవునికి లంచమును ఇస్తాడు.ఇద్దరూ భక్తులే ....
నేటి భక్తుల పరిస్థితులు ఈ విధముగా ఉంటున్నాయి (కొందరు మాత్రమే )..
అయితే, ఈ రెండు భావాలలో దేవునికి ఇష్టమైనది ఏ విధమైన భావము?
రెండు భావాలు అని అంటున్నావా ? జాగ్రత సుమా ..
మొదటి  భావమే దేవునికి ఇష్టమైనది.
ఎందుకంటే,దేవుడు లంచము పుచ్చుకునేవాడు కాదు.
ఆయన పరిశుద్దుడు,నీతిమంతుడు,యథార్థపరుడు.
ఆ దేవుని గురించి తెలుసుకుందాము, ఘనుడైన దేవాది దేవుని ఘన పరుచుదాము .                                  

కామెంట్‌లు లేవు: