హోమ్దేవుడు-దైవత్వంమనిషి-మనస్తత్వంస్వర్గం-నరకంపాపం-పుణ్యందేవదూతలు-దేవతలువిగ్రహాలుమేధావులుఅమతము-కులము

19, ఆగస్టు 2012, ఆదివారం

దేవుడు సృష్టికర్తవలె తన గుణమును ప్రకటిస్తున్నాడు.దేవుడు సృష్టి చేయగలడు ,కాబట్టి ఆయన సృష్టికర్త. అలాగే దేవుడు తనకు తానుగా ఉన్నవాడు అంటే స్వయంభవుడు .దేవుడు అంతట నివసించువాడు అంటే సర్వవ్యాపి , అంతేకాని సర్వాంతర్యామి కాదు.అంటే అన్నిటిలో ఉన్నవాడు కాదు.దేవుడు ఒకే సమయములో అన్నిచోట్ల ఉండగలడు.
దేవుడు ఒక మహోన్నతమైన శక్తి.
ఆ దేవాది దేవుడిని ,ఆయన శక్తిని మనము తక్కువ చేయకూడదు.
మన భారతీయులకు ఎన్నో ఎన్నెన్నో వేదాలు,ఉపనిషతులు,పురాణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
దేవుని స్వభావ లక్షణములను గురించి అవి ఎలా, ఏమని చెప్తున్నాయి,వాటిలో ఉన్న దేవుని గొప్ప లక్షణములు ఏమిటి అని మనము చాలా జాగ్రతగా విశ్లేషించవలసిన అవసరము మనకెంతో ఉంది.
ఎందుకంటే, దేవుని గుణలక్షణములను తెలుసుకొనుట వలన దేవుడిని ఆయన శక్తిని అనుభవింగలుగుతాము. నిజముగా, దేవుడు అంటే ఏమిటో ఆయన గుణములు తెలియక మనుష్యులు వారికి ఇష్టము వచ్చినట్లు జీవిస్తున్నారు.
దేవుడు అంటే ఏమిటో తెలియకనే ఇదే కారణం.
కాబట్టి వేదాలలో ఉన్న దేవుని లక్షణములను గూర్చి మనసు పెట్టమని మనవిచేస్తున్నాను.
మనము,  దేవుడిని అవమానపరిచే విధముగా జీవించక ఆయనను గోప్పచేసే విధముగా జీవించుదాము.
మనుష్యులలో మానవత్వము పెంపొందుటకు పాటుపడదాము.
దేవునికే జయము - నిజముగా దేవుని వెంబడించే మనిషికే జయము .           

కామెంట్‌లు లేవు: