హోమ్దేవుడు-దైవత్వంమనిషి-మనస్తత్వంస్వర్గం-నరకంపాపం-పుణ్యందేవదూతలు-దేవతలువిగ్రహాలుమేధావులుఅమతము-కులము

17, మే 2016, మంగళవారం

మతం మార్చుకోవద్దు -మనస్సు మార్చుకోండి

"మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస్తు.-1
రచయితకు నేను మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను.నిజమే...ముమ్మాటికి నిజమే.నేను అనుకుంటున్నాను, ఈ మాటలు వ్రాసిన రచయిత ఒకప్పుడు క్రైస్తవుడై ఉండి పశ్చాత్తాపం పొందలేక యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడనిపిస్తుంది.యేసు క్రీస్తును నమ్మినవారు మరలా పాపాలు చేసి పశ్చాత్తాపం లేకుండా చనిపోయినా...అసలు యేసుక్రీస్తునే విశ్వసించకపోయిన దేవాధిదేవుని ఉగ్రతకు గురికావలసినదే.అయితే యేసుని విశ్వసించి అంతము వరకు తనను తాను కాపాడుకున్నవారికి (వారి ఆత్మకు)నిత్యజీవము.ఒక్క మాట అడుగుతున్నాను ఏ హైందవ గ్రంథము శత్రువును ప్రేమించమని చెప్పింది.?చెప్తారామీరు?.శత్రువును ప్రేమించు అనే మాటను మీరు ఒప్పుకుంటారా....?."ఒక హిందువు మతం మార్చుకుంటే,ఒక శత్రువు తయారయ్యాడు అని గుర్తుచుకోండి" అని వివేకానందుడు చెప్పినమాట మీ చెవులకు వినసొంపుగాను,మీ మనస్సులకు ఆనందముగాను ఉంటుంది కానీ,"మీరు  పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైయుండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్ధించుడి." అని యేసుక్రీస్తు చెప్పిన మాట మీకు పాపం చెయ్యండి అన్నట్టు వినబడుతుంది.ఈ యుగ సంభంధమైన దేవత ప్రతి క్రీస్తు వ్యతిరేకి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగ చేసింది. వాస్తవాన్ని వక్రీకరించటం మన భారతీయులకు బాగా వంటపట్టింది ఎందుకంటే భ్రాహ్మణ తత్వం లోనుండి మన భారత దేశం పుట్టింది బ్రాహ్మణమతంలోనుండి విహ్రహం,విగ్రహాన్ని ఆధారం చేసుకుని మతం పుట్టింది ఆ మతంలోనుండి వర్ణాలు వర్ణాలలోనుండి వర్గాలు వర్గాలలోనుండి కులాలు పుట్టుకుంటూ వచ్చాయి.కాబట్టి ఎవరికీ వారు వారి జాతి వర్ణం వర్గం కులం బలహీనమై పోతున్నాయి అని మానసికవేదనతో మనస్సు మార్చుకోలేని స్థితిలో యేసును నమ్మలేక పుట్టు పాపినని ఒప్పుకోలేక యేసుక్రీస్తు మీద ఆయన బోధమీద తిరుగుబాటు చేస్తున్నారు.నా దృష్టిలో ఉగ్రవాదం కంటే భయంకరమైనది మతోన్మాదమే.ఎందుకంటే ఉగ్రవాదం మనిషిని నాశనంచేయవచ్చుగానీ,ఈ మతోన్మాదము మనసుని పాడుచేసింది.అందుకే మత మార్పిడి అనే మాట ప్రపంచదేశాలన్నీ ఉపయోగిస్తున్నాయి.వీళ్ళు ఎవరు మనస్సు గురించి ఆలోచించట్లేదు.వీళ్ళ మనసంతా మతమే.మతం గురించి ఆలోచించేవాళ్లకు వారి మనసు ఎలా ఉందొ ఎలా తెలుస్తుంది.....యేసుక్రీస్తు మత మార్పిడి చేసుకోమని చెప్పలేదు..మరి?మొట్టమొదట ఆయన ప్రసంగం ప్రారభవాక్యము.
 మత్తయి 4 : 17 అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అంటే ఆయన బోధంతా మనిషి మనస్సు మార్చుకోమనే...     
మత్తయి 15 : 1 ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి 
2 నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారని అడిగిరి. 
3 అందుకాయనమీరును మీపారం పర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్ర మించుచున్నారు? 
4 తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము(నరకము) పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను. 
5 మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. 
6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. 
7 వేషధారులారా 
8 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; 
9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి 
10 జనసమూహములను పిలిచిమీరు విని గ్రహించుడి; 
11 నోటపడునది(చేతులు కడుగుకొనకుండ తినడం) మను ష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చునదియే మనుష్యుని అప విత్రపరచునని వారితో చెప్పెను. 
12 అంతట ఆయన శిష్యులు వచ్చిపరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా 
13 ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. 
14 వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. 15 అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా 
16 ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? 
17 నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని 
18 నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? 
19 దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును 
20 ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.ఇప్పుడు చెప్పండి మతం మార్చుకున్నవారు గొప్పవారా?లేక మనస్సు మార్చుకున్నవారు గొప్పవారా? 
నాకు యేసు క్రీస్తు ప్రభువు చెప్పినట్టు,నేను నాశత్రువును ప్రేమించి నా భార్య పిల్లలతో ప్రశాంతంగా వున్నాను.నన్ను ద్వేషించే వాడు ప్రశాంతత లేకుండా దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు.ప్రపంచంలో మొట్టమొదటి ప్రపంచ దిమ్మరి సాతాను. బైబిల్ ప్రకారం మొట్టమొదటి దేశదిమ్మరి కయీను. 
ఆదికాండము 4 : 8 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. 9 యెహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడునే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. 
10 అప్పుడాయననీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది. 
11 కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు; 
12 నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.                     
         భారతదేశం నా మాతృభూమి.భారతీయులంతా నా సహోదరులు,నేను నా దేశమును ప్రేమించుచున్నాను.నేను భారతీయుడనే,అయితే మతం మార్చుకున్నవారు చర్చికి వెళ్ళినా,ప్రార్ధనలు చేసినా,ఉపవాసాలుండిన, మనస్సు మారకపోతే శిక్ష తప్పదు.వారికే కాదు సుమా....క్రీస్తుని నమ్మని వారికి కూడా...అదే శిక్ష. దేవుడు పక్షపాతి కాదు ఆయన లంచము (చాలా మంది భక్తులు గుళ్ళకు వెళ్లి చేసిన పాపానికి కానుక ఇస్తారు.వాళ్ళు అనుకుంటారు ఈ కానుక తీసుకుని దేవుడు నన్ను క్షమిస్తాడు అని.కానీ, దేవుడు హృదయమును కానుక ఇమ్మన్నాడు.)పుచ్చుకొనడు.
బైబిల్ 1 సమూయేలు 16 : 7 అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మతం మార్చుకోకండి బైబిల్ చదివి దానిని వక్రీకరించే మీ మనస్సులు మార్చుకోండి. సాతానుడు దేవుని వ్యతిరేకి,మీరెందుకు వానితో కలుస్తారు.దయచేసి వానికి(సాతనుకి )దూరముగా ఉండండి.
దేవుడు మిమ్ములను దీవించును గాక.ఆమెన్           

కామెంట్‌లు లేవు: